Friday 3 March 2017

కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీ రీవ్యూ అండ్ రేటింగ్!!!

నిర్మాత :అనిల్ సుంకర
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం : వంశీ కృష్ణ
నటీనటులు :రాజ్  తరుణ్ ,అను ఇమ్మానుయేల్ ,అర్బాజ్ ఖాన్
కథ :
కిట్టు(రాజ్ తరుణ్ )  మెకానిక్ పనులు  చేస్తూ గడుపుతుంటాడు. కిట్టు  జానకి(అను ఇమ్మానుయేల్ ) ప్రేమలో  పడతాడు. కిట్టు డబ్బు కోసం  ఖరీదైనా  ఇళ్లల్లో కుక్కలను పడ్తూ ఉంటాడు, ఈ విషయం తెలిసిన జానకి కిట్టు కు  
దూరం అయిపోతుంది. ఇంతలో జానకి ని డాన్ (అర్బాజ్ ఖాన్) కిడ్నప్ చేస్తాడు.
                                                                               అర్బాజ్ ఖాన్ జానకి ని ఎందుకు కిడ్నప్ చేసాడు ?కిట్టు జానకి ను ఎలా కాపాడాడు?అసలు అర్బాజ్ ఖాన్ జానకి ని ఎందుకు కిడ్నప్ చేస్తాడు ?అసలు కిట్టు కుక్కలను పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అనేది మిగతా కథ
 ప్లస్ పాయింట్స్:
హీరో కుక్కలను పట్టేవాడు అని కాన్సెప్ట్ తీసుకున్న  డైరెక్టర్ వంశీ కృష్ణ ఈ  కథ కు  మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి విజయం  సాధించాడు. లాస్ట్ లో  కమెడియన్ పృథ్వీ చేసిన కామెడీ సినిమా కే  హైలైట్. పృథ్వి కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను చాల బాగా నవ్విస్తుంది. ఇక రాజ్ తరుణ్ కూడా చాల బాగా నటించాడు. 'జై చిరంజీవ' మూవీ తర్వాత తెలుగు లో నటించిన అర్బాజ్ ఖాన్ నటన మూవీ కి ప్రధాన ఆకర్షణ గా  నిలిచింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
మొదటి భాగం సినిమా రొటీన్  గా నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గ ఉంటుంది.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఫర్వాలేదు.పృథ్వీ కామెడీ బాగుంది మిగతా కామెడీ ఫర్వాలేదు.



TELUGU FILM EXPRESS          RATING: 3.25/5

No comments: