Friday 3 March 2017

గుంటూరోడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!!


నిర్మాణం :క్లాప్స్ అండ్ విజిల్స్
నిర్మాత :వరుణ్ అట్లూరి
నటీనటులు :మంచు మనోజ్ ,ప్రగ్య జైస్వాల్ ,రాజేంద్ర ప్రసాద్ , సంపత్ రాజ్
కథ, స్క్రీన్ ప్,  మాటలు ,  దర్శకత్వం :s .k సత్య
సంగీత దర్శకుడు : డిజె.  వసంత్
కథ:
కన్నా(మనోజ్ ) మొరటోడు ఇతనికి గొడవలు పెట్టుకోవడం చాల సరదా. చీటికీ మాటికీ గొడవలు పెట్టుకొని వాలని చితకొడుతూఉంటాడు. ఇతనికి మరి సంతోషం వేస్తే డాన్స్ లు చేస్తూ ఉంటాడు. సూర్య నారాయణ రావు(రాజేంద్ర ప్రసాద్ ) 'కన్నా' వాళ్ల నాన్న ఇతనికి కొడుకు అంటే చాల ఇష్టం. సూర్యనారాయణరావు కన్నా కి పెళ్లి  చేస్తే అయినా మారతాడేమో అని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఒక పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫ్రెండ్ అమృత (ప్రగ్య జైస్వాల్ ) ను చూసి ప్రేమ లో పడతాడు. అమృత కోసం ఎవరినైనా ఎదిరించడానికి రెడీ అవుతాడు. ఈ సమయం లో కన్నా కు గుంటూరు లో పేరుమోసిన క్రిమినల్ లాయర్ శేషు కు మధ్య గొడవ జరుగుతుంది. శేషు అమృత వాళ్ల అన్నయ్య. ఇంతలో శేషు కు తన చెల్లి...  కన్నా ను ప్రేమిస్తుంది  అని తెలుస్తుంది. తన చెల్లి -కన్నా ప్రేమ విషయం తెలిసిన శేషు వారిని విడదీయడానికి ఎం చేసాడు ?కన్నా తన ప్రేమ ను ఎలా గెలుచుకున్నాడు? అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
1. మంచు మనోజ్ మాస్ నటన
2. సంపత్ రాజ్ మరియు ఇతర నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
3. మాస్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
1.కామెడీ సీన్స్ లేవు
2. రొటీన్ స్టోరీ



TELUGU FILM EXPRESS         RATING:  3/5     

No comments: