Friday 24 February 2017

యమన్ మూవీ రివ్యూ మరియు రేటింగ్!!!

తెలుగు నిర్మాణం:ద్వారకా క్రియేషన్స్
నిర్మాత:మిర్యాల రవీందర్ రెడ్డి
డైరెక్టర్ :జీవ శంకర్
సంగీతం:విజయ్ ఆంటోనీ
నటీనటులు :విజయ్ ఆంటోనీ ,మియా జార్జ్
కథ :
కథ విషయానికి వస్తే రాజకీయాలలో మంచి స్థాయిలో వున్నా దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోనీ), అతనికి పొలిటికల్ సర్కిల్ లో శత్రువులు ఎక్కువ. గాంధీని ప్రత్యర్థి అయినా పాండురంగా హత్య  చేస్తాడు. ఇది చుసిన గాంధీ భార్య తన బిడ్డని ఒంటరి చేసి చనిపోతుంది. అలా ఒంటరిగా పెరిగి అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోనీ ) గా పెద్దవాడవుతాడు. 
                          ఐతే ఒక హత్య విషయం లో చేయని నేరానికి అశోక్ జైలు కి వెళతాడు. అలా జైలు కి వెళ్లిన అశోక్ చక్రవర్తి ని ఆ హత్య రెండు గ్రూప్ ల మధ్య గొడవలో పడేస్తుంది . కరుణాకర్ అనే పెద్దమనిషి అశోక్ చక్రవర్తి ని జైలు నుంచి విడిపిస్తాడు. అశోక్ చక్రవర్తి ఒక అమ్మాయి తో ప్రేమలో కూడా పడతాడు. అశోక్ చక్రవర్తి కూడా తన నాన్న లాగే రాజకీయాల్లో వస్తాడు. రాజకీయాల్లో తన నాన్న ని చంపి ఎం. పి ఎదుగుతున్న పాండురంగ ఎదురుపడతాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో అశోక్ చక్రవర్తి తనను జైలు నుంచి విడిపించిన కరుణాకర్ కి అలాగే తన నాన్న ని  చంపిన పాండురంగా కి ఎదురు తిరగాల్సి వస్తుంది.
అశోక్ చక్రవర్తి రాజకీయాల్లో ఎలా ఎదిగాడు?పాండురంగా మీద పగ ఎలా తీర్చుకున్నాడు? తన ప్రేమ ని ఈ ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
1. విజయ్ ఆంటోనీ యాక్టింగ్
2. పొలిటికల్ థ్రిలర్ సీన్స్
3. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
4. సరికొత్త కథ ,కథనం
మైనస్ పాయింట్స్ :
1. కొన్ని బోరింగ్ సీన్స్
2. పాటలు
3.కొన్ని చోట్లా నెమ్మదించిన కథనం

TELUGU FILM EXPRESS         RATING:  3/5

No comments: