Friday 17 February 2017

రానా "ఘాజీ " మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!!


దర్శకత్వం :సంకల్ప్ రెడ్డి
నిర్మాణం :పీవీపీ ఎంటర్టైన్మెంట్స్ ,మాటినీ  ఎంటర్టైన్మెంట్స్
సంగీతం :కృష్ణ కుమార్
నటులు :రానా ,అతుల్ కులకర్ణి ,ఎం కే  మీనన్,ఓం పూరి ,తాప్సి
1971 లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ సబ్  మెరైన్ యుద్ధం ఆధారంగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
కథ :
అప్పట్లో పశ్చిమ పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న తన సైనికుల సహాయం కోసం పాకిస్థాన్ నావెల్ బేస్ నుంచి 'ఘాజీ' అను సబ్  మెరైన్ ని బంగ్లాదేశ్ కి పంపుదాం అనుకుంటుంది పాకిస్థాన్. ఐతే బంగ్లాదేశ్ తీర ప్రాంతం చేరాలంటే ఇండియా జలాల మీదుగా వెళ్ళాలి,ఆలా వెళ్తూ ఇండియా సబ్ మెరైన్ ను  నాశనం చేసి అలాగే విశాఖపట్నం ఓడరేవు ను   నాశనము చేయాలనుకుంటుంది  పాకిస్థాన్. ఆ టైం లో I N S విక్రాంత్ మన సముద్రజలాలకు కాపాడుతూ ఉంటుంది. పాకిస్థాన్ ఇండియా మీదుగా వెళ్తుందన్న విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ముందుగా "ఎస్ -21" సబ్ మెరైన్ ను పాకిస్థాన్ సబ్ మెరైన్ "ఘాజీ " ను ఎదురుకునేందుకు నిలుపుతారు.
మన ఇండియన్ "ఎస్ -21" పాకిస్థాన్ "ఘాజీ" ని ఎలా ఎదురుకుంది ?మన సబ్ మెరైన్ శక్తి సామర్ధ్యాలు ఎలాంటివి ?ఈ విజయం లో ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్ కమాండెంట్ (కే.కే. మీనన్ ),లెఫ్టినంట్ కమాండెంట్ (రానా )లు పోషించిన పాత్రా ఎలాంటిది?ఈ యుద్ధం ఎలా జరిగింది ?అనేది అసలు కథ. తాప్సి ఇందులో శరణార్థి గా నటించింది.
ప్లస్ పాయింట్స్ :
మొదటగా ఈ సినిమా కి రియల్ హీరో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు మనకి తెలియని చరిత్రను కళ్ళకి కట్టినట్లు చూపాడు. ఇంత టఫ్ సబ్జెక్టు ను ఏమాత్రం కన్ఫ్యూషన్ లేకుండా క్రిస్టల్ క్లియర్ గా సినిమా తెరకెక్కించిన విధానం అద్భుతం. సబ్ మెరైన్ గురించి ఏమాత్రం తెలియని వాళ్లకి కూడా అర్ధం అయ్యే విధంగా సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. సబ్ మెరైన్ లోపలి భాగం అందులోని వస్తువులు, అసలు నిజం సబ్  మెరైన్ ఎలా ఉంటుందో అలానే వుంది.
రానా తన లెఫ్టినంట్ కమాండెంట్ పాత్రలో బాగా నటించాడు. అతుల్ కులకర్ణి ,కేకే మీనన్ వారి వారి పాత్రలో చక్కగా నటించారు. vfx  ఎఫెక్ట్స్ బాగున్నాయి.రొటీన్ కథ లు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ సినిమా కొత్త అనుభూతి ని అందిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ అంశాలు ఆశించే వాళ్లకి,బి సి సెంటర్స్ లో ఈ సినిమా కొంత నిరుత్సహం కలింగించొచ్చు.
TELUGU FILM EXPRESS                RATING-3.5/5

No comments: