Thursday 9 February 2017

సింగం -3 రివ్యూ( రేటింగ్ -3/5)

సింగం -3
నటీనటులు :సూర్య ,శృతి హాసన్ ,అనుష్క,అనూప్ సింగ్
దర్శకత్వం :హరి
నిర్మాత :జ్ఞానవేల్ రాజా
సంగీతం :హరీస్ జైరాజ్
కథ :
నరసింహం (సూర్య ) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్ర ప్రదేశ్ లో ... హోంమినిస్టర్ ఒక మిషన్ మీద నరసింహన్ని మంగళూరు కి పంపిస్తాడు. కమీషనర్ హత్య కేసు విషయం మీద ఆ  మిషన్ నడుస్తుంది,నరసింహం త్వరగానే ఆ కేసు ని పూర్తి చేస్తాడు కానీ ఆ హత్యా వెనక ఎదో పెద్ద కుట్ర ఉందని గ్రహిస్తాడు దాని వెనక పెద్ద పారిశ్రామికవేత్త విఠల్(అనూప్ సింగ్)హస్తం ఉందని తెలుసుకుంటాడు . 
                                            ఆస్ట్రేలియా లో ఉండే విఠల్  ని ఎలా పట్టుకున్నాడు ?కేసు ని ఎలా పూర్తిచేసాడు ?శృతి హసన్ కి ఈ కేసు సంబంధం ఏంటి ?విఠల్ కి ఈ కేసు సంభందం ఏంటి ?అనేది ఈ కథ 
ప్లస్ పాయింట్స్ :
యముడు ,యముడు 2 లాగే సూర్య తన విశ్వరూపాన్ని చూపాడు. తన నటన తో కథ కి ఆయువుపట్టు ల మారాడు. తాను పలికిన డైలాగ్స్ తన ఎమోషన్స్ సినిమా కె హైలైట్, కథ మొత్తం తన నటన తో నడిపించాడు ... శృతి హాసన్ గ్లామర్  ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ. విలన్ నటన అద్భుతం. అందమైన లొకేషన్స్ పాటలకి మరింత అందని ఇచ్చాయి.
మైనస్ పాయింట్స్ :
కామెడీ ట్రాక్ అంతగా పండలేదు, కామెడీ పార్ట్ 1,2 లో ఉన్నట్టు లేదు... ఇకపోతే యముడు -2 లాగే ఇందులో కూడా విదేశాల్లో ఉండే విలన్ కోసం పోరాటం సాగిస్తాడు. కొన్ని సీన్స్ యముడు -2 లాగే  ఉన్నాయి. కథ లో కొత్తదనం లోపించింది. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు . 
సింగం -3 రేటింగ్ -3/5


No comments: