Friday 10 February 2017

నమో వెంకటేశాయ సినిమా రివ్యూ మరియు రేటింగ్ -3. 5/5

నటీనటులు :నాగార్జున ,అనుష్క ,ప్రగ్య జైస్వాల్ ,రావు రమేష్ ,సాయి కుమార్ ,సంపత్ కుమార్ ,జగపతి బాబు
నిర్మాణం :సాయి కృప ఎంటర్టైన్మెంట్ ప్రై .లీ.
నిర్మాత :మహేష్ రెడ్డి
దర్శకత్వం :కె . రాఘవేంద్రరావు  రావు
కథ :
చినప్పటినుంచి దేవుడ్ని ప్రత్యక్షంగా దర్శింకుకోవాలనే కోరిక ఉన్నవాడు రాం (నాగార్జున ). ఒక గురువు (సాయి కుమార్ )దగ్గర శిక్షణకు చేరుతాడు ఆ శిక్షణ లో భాగంగా ఓ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రాం ఆ మంత్రాన్ని పఠించిన వెంటనే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు కానీ రాం గ్రహించలేకపోతాడు . ఆ తర్వాత నిజం తెలుసుకొని బాధపడతాడు ఐతే గురువు ధైర్యం చెప్పి పాచికలు ఆట నేర్పి స్వామి ని చేరుకోమని చెప్తాడు. ఏడుకొండలు చేరుకున్న రాం అక్కడ జరుగుతున్న అక్రమాలను కృష్ణమ్మ (అనుష్క) సహకారంము తో ఎదురించి అక్కడి ప్రజలకు కొండా మహిమల గురుంచి చెబుతుంటాడు. అక్కడి రాజు (సంపత్) కు కొండా ఫై జరుగుతున్న అన్యాయాల గురించి చెప్తాడు కొండా మహిమ గురించి కూడా వివరిస్తాడు. దాంతో రాజు..  రామ్ ను ధర్మాధికారిగా నియమిస్తాడు.రాం వేంకటేశ్వరునికి సకల పూజలు భక్తి శ్రద్ధలతో జరిపిస్తూ భక్తు లకు ఆ కష్టం రాకుండా చూస్తూ ఉంటాడు . రాం పనితనానికి అతని భక్తి కి మెచ్చి వేంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. రాం స్వామి తో పాచికలు ఆడతాడు.
రాం హథీరాం బాబా గా ఎలా మారాడు?అక్కడి దుష్టశక్తులను ఎలా నాశనం చేసాడు ?పాచికల ఆట లో గెలిచింది ఎవరు ? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా కి ముఖ్యంగా వెన్నుముక్క నాగార్జున నటన, నాగార్జున లేకుంటే  సినిమా నే లేదు అన్న విధంగా నటించాడు నాగార్జున. అన్నమయ్య  తర్వాత అంత చక్కగా నటించారు ఈ సినిమా లో మరియు వేంకటేశ్వరుని పాత్రలో నటించిన సౌరభ్ జైన్ కూడా గొప్పగా మెప్పించాడు. అతడు పలికించిన హావభావాలు అమోఘం. కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. అనుష్క ,ప్రగ్య ,రావు రమేష్ , వారివారి పాత్రలకు న్యాయం చేసారు.గ్రాఫిక్స్ అద్భుతం . మొత్తం మీద సినిమా ను దర్శకేంద్రుడు ఒక దృశ్యకావం లా మలిచాడు
మైనస్ పాయింట్స్ :
జగపతిబాబు ఎపిసోడ్,అనుష్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మధ్యలో వచ్చే కొన్ని కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా నడిచాయి.
   నమో వెంకటేశాయ సినిమా  రివ్యూ  మరియు రేటింగ్ -3. 5/5



No comments: