Friday 24 February 2017

విన్నర్ మూవీ రివ్యూ మరియు రేటింగ్ !!!

బ్యానర్:లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
డైరెక్టర్:గోపి చంద్ మలినేని
నిర్మాతలు :నల్లమలపు బుజ్జి ,ఠాగూర్ మధు
నటీనటులు:సాయి ధరమ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్,అనూప్ సింగ్,జగపతి బాబు ,అలీ
సంగీతం :థమన్
సాయి ధరమ్ తేజ్ -రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సరి జోడిగా  నటించిన చిత్రం ఇది. నల్లమలపు బుజ్జి ,ఠాగూర్ మధు ఈ సినిమా ను నిర్మించారు. పండగ చేస్కో తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ఇది. థమన్ సంగీతం అందించారు.
కథ :
సిద్దార్థ్ (తేజ్ ),మహేందర్ రెడ్డి (జగపతి బాబు ) తండ్రి కొడుకులు.  సిద్దార్థ్ చిన్నతనం లో హార్స్ రేస్ ల మీద ద్వేషం పెంచుకొని తన తండ్రి నుంచి  విడిపోతాడు. అలా పెరిగిన సిద్దార్థ్ సితార (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమిస్తాడు. సితార తండ్రి మాత్రం వీరి ప్రేమను ఒప్పుకోకపోగా ఫేమస్ హార్స్ రైడర్ ఆది (అనూప్ సింగ్ ) కి ఇచ్చి పెళ్లి చేదాం  అనుకుంటాడు . 
సిద్ధార్థ్ తన ప్రేమ ను ఎలా గెలిచాడు?ఆది (అనూప్ సింగ్ ) ను ఎలా హార్స్ రైడింగ్ లో ఓడించాడు ?సిద్ధార్థ్ మళ్ళీ  తన తండ్రి ని ఎలా కలుసుకోగలిగాడు?ఆది కి మహేందర్ రెడ్డి (జగపతి బాబు ) మధ్య సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథ
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది సాయి ధరమ్ తేజ్ నటన గురించి  ఈ సినిమా లో నటన లో చాల పరిణితి పొందాడు తేజ్,తేజ్ కొత్త లుక్ కూడా స్టైలిష్ గా వుంది. జగపతి బాబు క్యారెక్టర్ చాల బాగుంది. పాటలు బాగున్నాయ్ లొకేషన్స్ సింప్లి సూపర్బ్. అలీ పీటర్ హెయిన్స్ గా వెన్నెల కిషోర్ పద్మ గా చేసిన  కామెడీ బాగా పండింది. అనసూయ  పరవాలేదు. నిర్మాతలు మూవీ క్వాలిటీ మీద ఎ మాత్రం కంప్రమైజ్  అవ్వలేదు. 
మైనస్ పాయింట్స్ :
1. సెకండ్ హాఫ్ 
2. నెమ్మదించిన క్లైమాక్స్ 

TELUGU FILM EXPRESS          RATING- 3.5/5

No comments: