డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `కాటమరాయుడు`. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ అన్నగా నటిస్తుంటే కమల్ కామరాజు, శివబాలాజీ, చైతన్యకృష్ణలు పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్నిడైరెక్టర్ డాలీ వీలైనంత తర్వగా పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేయడానికి ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు టీజర్‌ను జనవరి 26న విడుదల చేస్తున్నారట. సంక్రాంతికి డిజిటల్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేస్తారట.

No comments:
Post a Comment