మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. రేపు (జనవరి 11న) తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ అర్థరాత్రి నుంచే యూఎస్‌ఏ, యూఏయి తదితర ప్రాంతాల్లో ఖైదీ సందడి మొదలుకానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏయి)లో సుమారు 150కి పైగా ప్రీమియర్ షోస్‌తో నేడు ఖైదీ సందడి చేయనుంది.
తెలుగు సినిమాకు గర్వ కారణమైన ‘బాహుబలి’ ఇప్పటివరకూ చాలా ప్రాంతాల్లో రికార్డు రిలీజ్‌తో సంచలనం సృష్టిస్తే, చాలా ప్రాంతాల్లో బాహుబలిని మించిన థియేటర్లలో ఖైదీ విడుదలవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. యూఎస్‌ఏ, యూఏయి లాంటి ప్రాంతాల్లో ఖైదీదే రికార్డు రిలీజ్. మరి ఓపెనింగ్స్, కలెక్షన్స్ విషయంలోనూ బాహుబలిని ఖైదీ బ్రేక్ చేస్తుందా అన్నది వేచిచూడాలి. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించగా, కాజల్ హీరోయిన్‌గా నటించారు.

No comments:
Post a Comment